ఊరకున్న వారితోడ వూరునోప దెఱగవా చేరినాతో ముద్దులెల్లా జెప్పేవు గాక ||
ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము సారంబు దెలిసెగా జయము చేకొనుట ||
ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు యేరీతి తక్కరియౌటా యెఱఁగవు నీవు // పల్లవి //
ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా
ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన చేరలంతేసి కన్నుల జెంగలించే విప్పుడు ||
ఊరకే వెదకనేల వున్నవి చదవనేల చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము // పల్లవి //
ఊరికి బోయెడి వోతడ కడు చేరువతెరు వేగి చెలగుమీ ||
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు గారవంబులేని ప్రియము కదియనేటికే ||
ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మాకులదైవము ||
ఎండలోనినీడ యీమనసు పండుగాయ సేయబనిలేదు మనసు ||
ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక యింతయు నేలేటిదైవ మిక వేరే కలరా ||
ఎంత జాణరో యీకలికి కాంతుడ నీ భోగములకే తగునూ ||
ఎంత బాపనా సోద మింత గలదా అంతయు నీమహిమే హరిభట్లూ
ఎంత బోధించి యేమిసేసిన దన దొంతికర్మములు తొలగీనీ ||
ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే ||