ఈహీ శ్రీహరిగంటే యింత లేదుగా వట్టి దాహపుటాసల వెఱ్రి దవ్వు టింతేకాకా
ఉండ బాసీనడవిలో నొకతెనేను ఎండలు నీడలు గాసీ నేమి సేతురా ||
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె య్యొగ్గీనిదె శిశు వోయమ్మా
ఉదయాద్రి తెలుపాయె ఉడు రాజు కొలు వీడె | అద నెరిగి రాడాయె నమ్మ నా విభుడు ||
ఉన్న మాటలికనేల ఓ దేవా యెన్నటికిదే మాట నింకా నింకా
ఉన్నచోనే మూడు లోకాలూహించి చూచితే నీవే కన్నచోటనే వెదకి కానడింతే కాక.
ఉన్నతోన్నతుడు ఒడయవరు యెన్న ననంతుడే యీ ఒడయవరు
ఉన్నతోన్నతుడు వుడయవరు యెన్న ననంతుడే యీ వుడయవరు
ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము
ఉన్నవిచారములేల వోహో సంసారులాల యిన్నిటి కితడే రక్ష యిదే మీకు మనరో ||
ఉప్పవడము గాకున్నారిందరు యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు ||
ఉమ్మడినే యేమనినా మారకుండను | అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను ||
ఉయ్యాల యూఁపులు ఓ ముద్దులయ్యా వెయ్యారు గోపికలు వేడుక నూఁచెదరు // పల్లవి //
ఉయ్యాలా బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు
ఊరకుండు మనవే వొడబాటులిక నేలే కోరికలు గోరుకొంటా గొణగే గాని ||