అన్నిచోట్ల బరమాత్మవు నీవు యిన్నిరూపుల భ్రమయింతువుగా // పల్లవి //
అన్నిజాతులు దానెయైవున్నది కన్నుల కలికి మాయగరచెనోయనగ ||
అన్నిట నేరుపరిగా అలమేలు మంగ నీకు చిన్నచిన్న ముద్దులనే విడిపించెను // పల్లవి //
అన్నిటా జాణ వౌదువు ఓభళేశ్వర యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము // పల్లవి //
అన్నిటా జాణడు అలమేలుమంగపతి పన్ని నీకు మేలువాడై పరగివున్నాడు
అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు యెన్నికగా దుధిపద మెక్కితిమి మేలు // పల్లవి //
అన్నిటా నేరుపరి హనుమంతుడు పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు // పల్లవి //
అన్నిటా భాగ్యవంతుడవుదువయ్యా పన్నినందుకల్లా వచ్చు భామ నీకు నిపుడు // పల్లవి //
అన్నిటా శాంతుడైతే హరిదాసుడు దానే సన్నుతి దానేపో సర్వదేవమయుడు // పల్లవి //
అన్నిటా శ్రీహరిదాసుడగువానికి కొన్నిదైవముల గొలువగ దగునా // పల్లవి //
అన్నిటాను హరిదాసు లధికులు కన్నులవంటివారు కమలజాదులకు // పల్లవి //
అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది మన్నించునాతనికంటే మఱి లేరు దొరలు // పల్లవి //
అన్నిటికి నిదె పరమౌషధము వెన్నుని నామము విమలౌషధము // పల్లవి //
అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు యెన్నరాదు మాబలగ మెంఉకో మాపౌజు // పల్లవి //
అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె కన్నుల మావేడుకకు కడయేది యికను // పల్లవి //