అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము లందు వెలుగొందీ ప్రభమీరగాను // పల్లవి //
అన నింకే మున్నది అలుగ నేమున్నది కనుగొనలనే చూచి కరగుట గాక // పల్లవి //
అనంతమహిముడవు అనంతశక్తివి నీవు యెనలేనిదైవమా నిన్నేమని నుతింతును. // పల్లవి //
అనాది జగమునకౌ భళము అనేకాద్భుతంబౌ భళము // పల్లవి //
అనాది జగములు అనాది దేవుడు వినోదములు గని విసుకదు మాయ
అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో విని యాతని భజించు వివేకమా // పల్లవి //
అని రావణుతల లట్టలు బొందించి చెనకి భూతములు చెప్పె బుద్ది // పల్లవి //
అనిశము దలచరో అహోబలం అనంత ఫలదం అహోబిలం // పల్లవి //
అనుచు దేవ గంధర్వాదులు పలికేరు కనక కశిపు నీవు ఖండించేవేళను
అనుచు నిద్దరునాడే రమడవలెనే మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు // పల్లవి //
అనుచు మునులు ఋషు లంతనింత నాడఁగాను వినియు విననియట్టె వీడె యాడీఁగాని // పల్లవి //
అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా // పల్లవి //
అనుమానపుబ్రదుకు కది రోతా తన మనసెనయనికూటమి మరి రోతా // పల్లవి //
అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా వన్నెల నప్పులు గొన్న వారువో వీరు // పల్లవి //
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము