ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ ||
రాధామాధవరతిచరితమితి - బోధావహం శ్రుతిభూషణం
రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ ||
ప|| రామ మిందీవర శ్యామం పరాత్పర | ధామం సుర సార్వభౌమం భజే ||
ప|| రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా | సౌమిత్రిభరతశత్రుఘ్నలతోడ జయమందు దశరథరాఘవా ||
రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగెనిందరికి
ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | నామమే కామధేనువు నమో నమో ||
రామా దయాపరసీమా అయోధ్యపుర ధామా మావంటివారితప్పులు లోగొనవే
ప|| రాము డిదే లోకాభిరాము డితడు | గోమున పరశురాముకోప మార్చెనటరే ||
రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు( గాచినవాడీతడు
ప|| రాముడు లోకాభిరాముడందరికి రక్షకు డీతని దెలిసి కొలువరో | కామిత ఫలదుడు చరాచరములకు గర్తయైన సర్వేశ్వరుడితడు ||
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య ధాముడు రణరంగ భీముడు వాడే
రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్త య్య పొందులు నీతో చాలును
ప|| రూకలై మాడలై రువ్వలై తిరిగీని | దాకొని వున్నచోట దానుండ దదివో ||
ప|| రెండుమూలికలు రేయిబగలు నున్నవి | అండదేహమం దొకటి ఆతుమలో నొకటి ||