ప|| విడుమనవో రోలు విడుమనవో వేగ | విడుమనవో తల్లి వెరచీ, నీబాలుడు ||
విడువరా దెంతైనా వెఱ్రివాడైన నీకు కడవారు నవ్వకుండా గాచుకో నన్నును
విడువవిడువనింక విష్ణుడ నీపాదములు కడగి సంసారవార్థి కడుముంచుకొనిన
ప|| విధినిషేధములకు వెరువగబనిలేదు | మధుసూదన నిమన్నన దాసుడైతే ||
వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ
ప|| వినుడిదె రఘుపతి విజయములు | పనుపడి రాక్ష బాధలుడిగెను ||
విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా
విన్నవించితిమి నీకు వేడుకవేళ కన్నెను నీవు దయ గాచేటివేళ ||
విభుడ వింతటికి వెరపుతో ననుగావు అభయహస్తముతోడిఆదిమూలమా
విరహ మొక్కందమాయ విచ్చేయవయ్యా నిరతి నాకెజూచి నీవంటా మొక్కితిమి ||
విరహపు రాజదె విడిదికి రాగా సిరుల జేసె నిదె సింగారములూ
ప|| విరహాన బడలెను విభుడు యిందాకాను | పురుషార్థమిందు వంక బొందేదేమే ||
ప|| విఱిగిరి దానవవీరు లదె | అఱిముఱి దేవత లాడే రదె ||
వివరముమాలినట్టివెర్రిదేహి తొల్లి జవకట్టినంతే కాక చండిపోరనేటికే
ప|| వివేకమెఱుగనివెఱ్ఱులముగాక నేము | దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా ||