ప|| లంకెలూడుటే లాభము యీ- | కింకరులను నలగెడికంటెను ||
లక్ష్మీకల్యాణము లలితోంబాడిమిదె నేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును ||
లలిత లావణ్య విలానముతోడ | నెలత ధన్యతగతిగె నేటితోడ ||లలిత||
లాలనుచు నూచేరు లలనలిరుగడల | బాలగండవీర గోపాలబాల || -- (నీలాంబరి)
లెండో లెండో మాటాలించరో మీరు కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి॥
ప|| లేదు బ్రహ్మవిద్యామహాసుఖము తమ- | కీడు తమకర్మ మేమిసేయగవచ్చు ||
లేదు భయము మఱి కాదు భవము ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ఞేకాన
ప|| లోకపు నీ చేతలకు లోనేకాదా | నీకు మారుకొని యుండ నేరుపా నాకు ||
ప|| వందే వాసుదేవం | బృందారకాధీశ వందిత పదాబ్జం ||
వందేహం జగద్వల్లభం దుర్లభం | మందర ధరం గురుం మాధవం భూధవం ||
వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల
ప|| వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు | బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ ||
వద్దు నన్ను జెనకకుర వాదేటికి, చద్ది వేడికి సొలపుజంకెనలు మేలు ||వద్దు||
ప|| వద్దే గొల్లెత వదలకువే నీ- | ముద్దుమాటలకు మొక్కేమయ్యా ||
ప|| వననిధి గురిసినవాన లివి మతి- | పనిలేని పనులభారములు ||