ప|| వనితలకు బతికి వలపే కీలు | ననువు గలిగితేను నాను బ్రియములా ||
వలచి పైకొనగరాదు వలదని తొలగ రాదు కలికిమరుడు సేసినాజ్ఞ కడవగరాదురా
ప|| వలచిన పతివాడే వచ్చినదాన నేనిదె | తలపులు దలపులు తారుకాణలెన్నడే ||
ప|| వలచుటే దోసమా వనిత నీకాతడు | నలువంక మరియేటి నవ్వులు నవ్వవే ||
ప|| వలదన నొరులకు వశమటనే | తలచినట్లనిది దైవమెచేసె ||
వలదన నొరులకు వసమటవే తలచినట్లు నిది దైవమె చేసె
వలదననొరులకు వశమటవే తలచినట్లనిది దైవమెచేసె
వలపు తొలకరించె వనితపైనిదె నేడు చెలువుడ వింతట విచ్చేయవయ్యా ||
ప|| వలపు లధికము సేయు వైభవములు | తలపు లధికము సేయు దలపోతలు ||
వలపేడ గలిగెనె వామలోచనకు దీని వలపించినటువంటి వాడింకనెవ్వదో ||
ప|| వలవని మోహావస్థల బొరలెడి- | మలినం బెన్నడు మానును ||
ప|| వలెననువారిదె వైష్ణవము యిది | వలపుదేనెవో వైష్ణవము ||
వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ
వాడల వాడల వెంట వాడెవో, నీడ నుండి చీర లమ్మే నేత బేహారి.
వాడివో వీడివో హరి వలసిన వారికెల్లా మూడులోకముల మరి మొరగ జోటేడి