మైలవాసి మణుగాయ మాటలేలరా చాలుజాలు బనులెల్ల జక్కనాయరా ||
మొక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వీ శ్రీ వేంకటేశ్వరుడు
మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు
ప|| మొదలుండ గొనలకు మోచి నీళ్ళు వోయనేల | యెదలో నీవుండగా నితరము లేలా ||
ప|| మొఱపెట్టెదము మీకు మొగసాలవాకిటను | మఱగుచొచ్చితి మీకు మము గావరో ||
ప|| మోపుల చిగురుల చిమ్ములవేదము | ఆవుల మందలలోని ఆవేదము ||
ప|| మోసమున మాయావిమోహితుడైపోయి | కాసుసేయనిపనికి గాసిబడె బ్రాణి ||
ప|| మోహంపు రతిముదము ముద్దుజూపుల మదము | దేహంపు సొబగెల్లదెలిపె సదమదము ||
ప|| మోహము విడుచుటే మోక్ష మది | దేహ మెరుగుటే తెలివీ నదే ||
యజ్ఞ మూర్తి యజ కర్త యజ్ఞ భోక్తవిన్నిటాను యజ్ఞాది ఫలరూప మటు నీవై వుండవే
రంగ రంగ రంగ పతి రంగనాధా నీ సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా
ప|| రమ్మనగా దనతో నే రానంటినా | చిమ్మును నింత ప్రియముచెప్ప నేలెనాకు ||
ప|| రమ్మనవే ఇకను నీ రమణునిని | పమ్మి వలపులు చల్లీ బదిమారులు ||
ప|| రసికుడ తిరుపతి రఘువీరా | కొసరుగాదు నాలోని కూరిములు గాని ||