జోజో దీనజనావనలోలా జోజో యదుకుల తిలకా గోపాలా // పల్లవి //
ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||
జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల నానావిహాల విని నమ్మేరు సుండి
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥పల్లవి॥
తగిలనమును లేయాతని గందురంటా మగువ యెవ్వరితోడ మాటాడదిపుడు ||
ప|| తగుతగు నీ దొరతనము లిక | వెగటు లన్నియును వేడుకలాయ ||
తగుదువమ్మ నీ వందపుమరుతండ్రికి మొగిదచ్చి నమృతము మోవి నుంది గాన
ప|| తతిగని తతినేల తమకించరే | మతిలోని నొప్పి గొంత మాన నియ్యరే ||
తత్తాడి గుడి ధింధిం తకధింధిం తిత్తి తిత్తితి తితి తితి తితి||
తన మేలెచూచు గాక తరుణుల యెడలను యెనలేని మగవాని నేమనగ వచ్చును ||
ప|| తనకర్మమెంత చేతయు నంతే | గొనకొన్న పని యంత కూలే నంతే ||
ప|| తనకర్మవశం బించుక, దైవకృతం బొకయించుక, | మనసువికారం బించుక, మానదు ప్రాణులకు ||
ప|| తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు | మనసు చంచల బుద్ధి మానీనా ||
ప|| తనదీగాక యిందరిదీగాక | తనువెల్ల బయలై దరిచేరదు ||
తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి యెనలేక శరణంటే నితడే రక్షించును