ప|| చెలియరో నీవే కదే సృష్టికర్తవు | నిలువున నీ మగడు మెచ్చె నమ్మా ||
ప|| చెలియా నాకు నీవు సేసే వుపకారమిది | వెలలేని గుణముల వేడుకకాడతడు ||
ప|| చెలులారా చూడరే యీ చెలి భాగ్యము | అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము ||
ప|| చెలులాల యీమేలు చెలువుడే చూచుగాని | యెలమి తోడుత మొక్కి యెరిగించరే ||
ప|| చెల్ల నెక్కికొంటివిగా జీవుడ యీబలుకోటా | బల్లిదుడ నీకు నేడు పట్టమాయ గోటా ||
చెల్లబో తియ్యనినోర జే దేటికి యి పల్లదపుగొరికలపాలు సేయవలెనా
చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో వుల్లమున నున్నహరి వూరకే దవ్వాయ
ప|| చెల్లుగా కిట్టు నీకే చింతింపగా పూరి- | పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు ||
ప|| చెల్లునంటా వచ్చివచ్చి చెట్టా పట్టేవు | తొల్లియు నెందరి నిట్టే దొమ్ముల బెట్టితివో ||
చేకొంటి నిహమే చేరినపరమని కైకొని నీవిండు కలవేకాన
చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే యేకడ జూచిన యితరము లేదు.
ప|| చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ | యేతులే బూమెల్లా నిండె నీదేవునికి ||
ప|| చేపట్టి మమ్ము గావు శ్రీనరసింహా నీ- | శ్రీ పాదములే దిక్కు శ్రీనరసింహా ||
చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు యీ రీతి శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడు
చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు కోరి వరము లిచ్చు కొండవంటి సింహము // పల్లవి //