ప|| తలపులోపలితలపు దైవమితడు | పలుమారు బదియును బదియైనతలపు ||
ప|| తలపోత బాతె తలపులకు దమ- | కొల దెరంగనిమతి గోడాడగా ||
ప|| తలమేల కులమేల తపమే కారణము | ఎలమి హరిదాసులు ఏజాతి యైననేమి ||
ప|| తహతహలిన్నిటికి తానే మూలము గాన | సహజాన నూరకున్న సంతతము సుఖము ||
తానె తానే యిందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
తానెంత బ్రదుకెంత దైవమా నీమాయయెంత మానవుల లంపటాలు మరి చెప్పగలదా ||
ప|| తానెట్లున్నాడో తరుణి వినిపించనే | కానక నినుగన్న నతినిగన్నట్లు నాయనే ||
ప|| తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన- | లోన బెట్టుకొని మాకు లోనైనవాడు ||
ప|| తానే తెలియవలె తలచి దేహి తన్ను | మానుపువారలు మరి వేరీ ||
ప|| తాపలేక మేడ లెక్కదలచేము | యేపులేని చిత్తముతో యీహీహీ నేము ||
తాము స్వతంత్రులు గారు తమయంతను ఆమీదటిగురి ఆది నీవు.
ప|| తారకబ్రహ్మము తానైవున్నాడు | ధారుణిలో చెలువొందె దశరథరముడు ||
తారుకాణ సేసుకొంటే తనే నేను ఈ రీతి నవ్వుగానీ ఇంటికి రమ్మనవే ||
ప|| తినరాని కొనరాని దేవలోకపుబండు | మనసున దలచితే మరగించే పండు ||
ప|| తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ | సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||