ప|| నగధర నందగోప నరసింహ వో- | నగజవరద శ్రీ నారసింహ ||
ప|| నగవులు నిజమని నమ్మేదా | వొగినడియాసలు వొద్దనవే ||
ప|| నగు మొగము తోడి వో నరకేసరి | నగ రూప గరుడాద్రి నరకేసరి ||
ప|| నగుబాట్లబడేనాజిహ్వా | పగటున నిదివో పావనమాయ ||
ప|| నటనల భ్రమయకు నా మనసా | ఘటియించు హరియే కలవాడు ||
ప|| నడువరో జడియక సవ్యమార్గమిది | మడుగరి వైష్ణవ మార్గమిది ||
ప|| నదులొల్లవు నాస్నానము కడు- | సదరము నా కీస్నానము ||
నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ అన్నిటా రక్షించకపో దంతర్యామి
నన్ను నెవ్వరు గాచేరు నాటిపగెంతురుగాక నిన్న నేడీరోతలైతే నీతియౌనా నాకును.
ప|| నమామ్యహం మానవ సింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||
ప|| నమామ్యహం మానవసింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||
ప|| నమిత దేవం భజే నారసింహం | సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం ||
ప|| నమో నమో జగదేకనాథ తవ సర్వేశ | విమల విశ్రుత లసద్విఖ్యాత కీర్తే ||
ప|| నమో నమో దశరథ నందన మము రక్షించు | కమనీయ శరణాగత వజ్రపంజర ||
ప|| నమో నమో దానవవినాశక చక్రమా | సమర విజయమైన సర్వేశు చక్రమా ||