ప|| నిన్నుబాసినయట్లు నెలతకు వియోగదశ | లెన్నడును దోప విదియేమోకాని ||
నిముషమెడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక
నిలు నిలు దగ్గరకు నీయాన నీకు వలచితినని మావారెల్లనగరా ||
నీ విభుడు వచ్చు దాక నిచ్చ్లాన నుండ వే వేవేలకును రేయి వేగించవేమే ||
ప|| నీ వేలికవు మాకు నీదాసులము నేము | ఆవల నితరుల నే మడుగబొయ్యేమా ||
ప|| నీకథామృతము నిరతసేవన నాకు | చేకొనుట సకల సంసేవనంబటుగాన |
ప|| నీకేమయ్య నీకు నీవే దొడ్డవాడవు | చేకొని చెట్టడిచితే చేటడేసి వాపులు ||
ప|| నీకేల భయము నీకునీకే యులికేవు | చేకొన్న నీచేతలందు జెరిగున్నావా ||
ప|| నీదాసుల భంగములు నీవుజూతురా | ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా ||
నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము
ప|| నీపాపమే కాదు, ఇది నిండిన లోకము జాడ | పైపై వచ్చిన వలపు పాటించరెవ్వరును ||
ప|| నీమహత్త్వంబు లోనికి వెలుపలికి గప్పి | కామింప నిట్టిదని కానారా దటుగాన ||
నీమహి మది యెంత నీవు చేసేచేత లెంత దీమసపునీమాయలు తెలియరాదయ్యా.
నీమహిమో నాలోన నిండిన వలపు జాడో యేమి సేతు నన్నెప్పుడు నెడపకుమయ్యా ||
ప|| నీయంత వాడనా నేను నేరము లే మెంచేవు | యీయెడ నిరుహేతుక కృప జూడు నన్నును ||