ప|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని ||
ప|| నీవేల సిగ్గుపడేవు నెట్టన దలవంచుక | భావించి నిన్ను బైకొని మెచ్చీని ||
నూతులు దవ్వగబోతే బేతాళములు పుట్టె కాతాళపులోకులాల కంటిరా యీసుద్దులు
ప|| నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్లగరాదు | చెయ్యార గంటిమి నేడు చేరి నీతో పొందుట |
ప|| నెయ్యములలో నేరెళ్ళో | వొయ్యన వూరెడి వువ్విళ్ళో ||
ప|| నెరవాది సాహసులు నిత్యశూరులు | దురిత విదూరులు ధృవాదులు ||
ప|| నెలత చక్కదనమే నిండు బండారము నీకు | గలిగె గనకలక్ష్మీ కాంతుడవైతివి ||
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ||
నే ననగా నెంతవాడ నెయ్యపుజీవులలోన యీనెపాన రక్షించీ నీశ్వరుడేకాక
ప|| నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి | శ్రీనాథుడవు నీచేత ఇంతేకాక ||
నే నొక్కడ లేకుండితే నీకృపకు బాత్ర మేది పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు
నేడు దప్పించుకొంటేను నేరుపున్నదా పేడుక భోగించుతానే పెనగ జోటున్నదా.
ప|| నేనెంత చిన్ననైనా నీకే సులభము గాని | పూని నా సరివారికి బొడవే సుమ్మీ ||
ప|| నేనెంత నీవెంత నిక్కె మా యిది | కానీ లేరా యిది యొక్క కాకు నేనే జాడలా ||
ప|| నేనెంతవాడను నిన్నడిగి నంటే | వీనుల నీకథలెల్లా వినుటేగా ||