నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు చాయల నీసుద్ది విని శరణంటి నేను
ప|| నీయంతటివారెవ్వరు నీకు నెదురేది యెందు | చాయల నీసుద్ది విని శరణంటినేను ||
నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు యీయహంకారపుముక్తి యీడేరీనా తమకు.
ప|| నీయాజ్ఞ దలమోచి నీదేహధారి నైతి | యీయెడ గోవిందుడ నే నీడేరేదెట్లో ||
నీయాధీనము లింతే నిఖిలప్రపంచమును మాయాకృతము నీవు మానుమంటే మానదా.
ప|| నీరువట్టు గొన్నవేళ నేయి మందదవునా | కూరిమి మమ్మిద్దరిని గూరుచరే చెలులు ||
ప|| నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు | నీవనుచు గనుగొన్ననిజమెల్ల నీవే ||
నీవుదేవుడవు | నేనొకజీవుడ ఈవిధి నిద్దరి | కెంత అంతరువు ||
నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు దైవమా సిగ్గుపడక తగిలే నేగాకా
ప|| నీవెరగనిది లేదు నీయాజ్ఞ మోచితి నింతే | నీవాడ నింతే హరి నేనన జోటేది ||
ప|| నీవే కావింక నేనన్య మెరగ యే- | త్రోవ చూపి నాకు దోడయ్యెదవయ్య ||
నీవే నేరవుగాని నిన్ను బంధించేము మేము దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు
ప|| నీవే మూలమువో నేరిచినపెద్దలకు | దేవుడు నీయందులోనే తిరమాయ నిదివో ||
ప|| నీవేకా చెప్పజూప నీవె నీవెకా | శ్రీవిభుప్రతినిధివి సేనమొదలారి ||
ప|| నీవేకాని యింక నేనన్య మెరుగనే | త్రోవజూసి నాకు తోడయ్యెద వయ్య ||