క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం
ప|| గంధము పూసేవేలే కమ్మని మేనయీ | గందము నీ మేనితావి కంటి నెక్కుడా ||
ప|| గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ- | వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక ||
ప|| గద్దరి జీవుడు కామధేనువు మాని | యెద్దు బిదుక జొచ్చె నేది దెరగు ||
ప|| గరుడ గమన గరుడధ్వజ | నరహరి నమోనమో నమో ||
గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుష లదివో వచ్చె బైపై సేవించను
గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె | సిరులొసగీ చూడరో చింతామణి ఈపె ||
ప|| గాలినే పోయ గలకాలము | తాలిమికి గొంతయు బొద్దులేదు ||
ప|| గుఱ్ఱాల గట్టనితేరు కొంక కెందైనా బారీ | విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు ||
గెలిచితి భవములు గెలిచితి లోకము యెలమి నీదాసుల కెదురింక నేది
గోవింద నందనందన గోపాలక్రుశ్ణ నీ భావము మాకుంజిక్కె గోపాలక్రుశ్ణ ||
గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము
ప|| ఘనమనోరాజ్యసంగతి చెలగినగాని | జనులకెప్పుడు నాత్మ సౌఖ్యంబు లేదు ||
ప|| ఘను డీతడొకడు గలుగగగదా వేదములు | జననములు గులము లాచారములు గలిగె ||