ప|| కూడు వండుట గంజికొరకా తనకు | వేడుకలు గల సుఖము వెదుకుటకు గాక ||
ప|| కూడులేక యాకటికి గూర దిన్నట్లు | ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య ||
ప|| కూరిమి గల్గితే జాలు కోపించినా మేలువో | అరయ నోరమణుడ అంతాను మేలువో ||
ప|| కొంచెమును ఘనము గనుగొననేల హరిదలచు- | పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు ||
ప|| కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన | బండాయ సంసారబంధము ||
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలో గోవిల గుయ్యగుండె వగిలె నీ యండకురాగా బ్రాణమంతలో బ్రదికెరా ||
కొండవంటి దొరవు నీ గుణమేల విడిచేవు వుండరాదా నీవుండే వొడికానను
ప|| కొండో నుయ్యో కుమతులాల | తండుముండు తట్టుముట్టు తాకైన గనుడీ ||
ప|| కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు | యిందరిలోపల నీవెడమాయలు యేగతి దెలిసే నేనయ్యా ||
ప|| కొనరో కొనరో మీరు కూరిమి మందు | వునికి మనికి కెల్ల నొక్కటే మందు ||
ప|| కొనుట వెగ్గళము దాదినుట యల్పము మీదు- | గనుట వినుట లేక దా కడచన్న భవము ||
కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు కుమ్మరింపుచు దెచ్చు కొన్నదీ వలపు
ప|| కొమ్మ దన ముత్యాలకొంగు జారగ బగటు | కుమ్మరింపుచుం దెచ్చుకొన్నది వలపు ||
కొమ్మలాలా ఎంతవాడె గోవింద రాజు కుమ్మరించీ రాజసమే గోవింద రాజు