చాటెద నిదియే సత్యము సుండో చేటు లేదీతని సేవించినను
ప|| చాల నొవ్విసేయునట్టి జన్మమేమి మరణమేమి | మాలుగలసి దొరతనంబు మాన్పుటింత చాలదా ||
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు చాలదా హితవైన చవులెల్లనొసగ
ప|| చాలదా హరిసంకీర్తనాంగల- | మేలిది దీననే మెరసిరి ఘనులు ||
చాలుచాలును భోగసమయమున మైమఱపు పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ
చాలునిదే నావిరతి సకసామ్రాజ్యము నాలోనిపని యెంతైనా నాకు గలదు
చింతలు రేచకు మమ్ము చిత్తమా నీవు పంతముతో మముగూడి బతుకుమీ నీవు.
చింతాపరంపరలు చిత్తంబునకుదొడవు ఇంతి సౌభాగ్యంబులిన్నిటికిదొడవు ||
చిక్కువడ్డపనికి జేసినదే చేత లెక్కలేనియప్పునకు లేమే కలిమి
ప|| చిత్త మతిచంచలము చేత బలవంతంబు | తిత్తితో జీవుడిటు దిరిగాడుగాక ||
చిత్తగించి రక్షించు శ్రీహరి నీవు యిత్తల మానేరములు యెన్ని లేవయ్యా
చిత్తగించుమిదె చెలియ వికాసము పొత్తులు గలపీ భోగంబులకు
చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం ||
ప|| చిత్తజగరుడ శ్రీనరసింహ | బత్తి సేసేరు మునులు పరికించవయ్య ||