ప|| ఘనుడాతడే మము గాచుగాక హరి | అనిశము నేమిక నతనికె శరణు ||
ప|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||
ప|| ఘోరదురితములచే గుణవికారములచే- | నీరీతిబడునాకు నేది దెరువు ||
చంచలపడగ వద్దు సారె సారె గోరవద్దు పొంచుకున్న దైవమే బుద్దులు నేర్పీని
చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥
ప|| చక్కదనముల వారసతులార | యెక్కువ తక్కువల మీరు ఏందుబోయేరికను ||
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని మానిని మీసరి యెవ్వరె యెక్కువైన నీ భావమెంచి చూడవసమా ||
చక్రమా హరి చక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో
చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత యెదిరి నన్నెఱగను యెంతైన నయ్యో ||
ప|| చదివెబో ప్రాణి సకలము యీ- | చదువుమీదివిద్య చదువడాయగాని ||
ప|| చదువులోనే హరిని జట్టిగొనవలెగాక | మదముగప్పినమీద మగుడ నది గలదా ||
ప|| చలపాది రోగమీ సంసారము నేడు | బలువైన మందు విష్ణు భక్తి జీవులకు ||
ప|| చల్లనై కాయగదో చందమామ | వెల్లిగా తిరి వేంకటేశు నెదుట || అప|| మొల్లమిగ నమృతంపు వెల్లిగొలుపుచు లోక- | మెల్ల నిను కొనియాడగా ||
చవినోరికేడ బెట్టు సంపదేడ బెట్టు దీని సవరించుటేల సంపదిది కాదా