ప|| కామధేను విదే కల్పవృక్ష మిదే | ప్రామాణ్యముగలప్రపన్నులకు ||
ప|| కామధేనువై కలిగె నీధరణి | వాములు వలసినవారికి విధులు ||
ప|| కామయాగము చేసెగలికి తన | ప్రేమమే దేవతా ప్రీతిగాను ||
ప|| కామించి నీవరుగగలయు నాయకుడ నే- | డేమి భాగ్యము సేసెనే తరుణి ||
కాయమనే వోరికి గంతలు తొమ్మిదియాయ పాయక తిరిగాడేరు పాపపు తలారులు ||
ప|| కాయము జీవుడుగలనాడే తెలియవలె | యీయత్నములు దనకెన్నడు ||
కాలమలారును గలిగెనీ కునిదె బాలకి యందే పైపైనీకు ||
ప|| కాలము కాలముగాను కపటాలే తఱచాయ | చాలునింక దీనితోడీజాలి మానరే ||
ప|| కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల- | కీలు వదలె సౌజన్యము కిందయిపోయినది ||
ప|| కాలాంతకుడను వేటకాడెప్పుడు దిరిగాడును | కాలంబనియెడి తీవ్రపుగాలివెర వెరిగి ||
ప|| కిం కరిష్యామి కిం కరోమి బహుళ- | శంకాసమాధానజాడ్యం వహామి ||
ప|| కింకదీర ’నదైవం కేశవాత్పర’మని | ఉంకువైననాలో నీవుపమలివే ||
ప|| కిన్నజానేऽహం కేశవాత్పర మహో | సన్నుతాకర మమాచరణాయ తస్మై ||
ప|| కుడుచుగాక తనకొలదిగాని మేలు | దడవీనా నోరు తగినయెంతయును ||
కులుకక నడవరో కొమ్మలాలా జలజల రాలీని జాజులు మాయమ్మకు