భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా ||
ప|| భావించి తెలుసుకొంటే భాగ్యఫలము | ఆవలీవలి ఫలము లంగజ జనకుడె ||
భావించి నేరనైతి పశుబుద్ది నైతిని యీవల నాయపచార మిది గావవయ్యా
భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో నేమవుకృష్ణజయంతి నేడే యమ్మా
భోగము నేను నీకు భోగివి నీవు శ్రీ గురుడ విన్నిటాను చిత్తగించు నన్నును ||
ప|| భోగి శయనమును బుసకొట్టెడినీ | యోగ నిద్ర పాయును మేల్కొనవే ||
ప|| భోగీంద్రులును మీరు బోయి రండు | వేగగ మీదటి విభవాలకు ||
ప|| మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును | మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయజయ ||
మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చంచుల పూవుదండలు చాతుకొనేరదివో
ప|| మంచిదివో సంసారము మదమత్సరములు మానిన | కంచును బెంచును నొకసరిగా దాచూచినను ||
ప|| మందరధర మధుసూదన | నందగోపనందనా ||
ప|| మందులేదు దీనికి మంత్రమేమియు లేదు | మందు మంత్రము దనమతిలోనే కలదు ||
మగవానికేడ సిగ్గు మగువలకింతేకాక యెగసక్కేలాడేనంటా యేలనవ్వేవిపుడు ||
మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ
మచ్చికతో నేలవయ్య మదన సామ్రాజ్యలక్శ్మీ పచ్చి సింగారాల బండారాలు నిండెను ||