ప|| పరమాత్మ నిన్నుగొల్చి బ్రతికేము | విరసపు జాలివెత బడనోపము ||
పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు | ధరమము విచారించ తగునీకు అమ్మ ||
ప|| పరమాత్ముని నోరబాడుచును యిరు- | దరులు గూడగదోసి దంచీ మాయ ||
ప|| పరిపూర్ణగరుడాద్రిపంచాననం | పరమం సేవే పంచాననం ||
పరిపూర్ణుడవు నీవు పరాకున్నదా నిన్ను మరిగి వుండనిదే మావల్ల దప్పు గాకా
ప|| పరులకైతే నిదే పాసముగాదా | పురిగొని నీవంక బుణ్యమాయగాక ||
ప|| పరులసేవలు చేసి బ్రదికేరటా | సిరివరుదాసులు సిరులందు టరుదా ||
పరుసము సోకక పసిడౌనా పురుషోత్తముడే బుద్దిచ్చుగాక.
ప|| పరుసము సోకియు బ్రదుకవద్దా | తిరిగి కర్మము లింక తీదీపులా ||
ప|| పరుసమొక్కటే కదా పైడిగా జేసేది | అరయలోహ మెట్లున్నా అందుకేగాని ||
పలపారగించవమ్మ వనిత నీ యలుక చిత్తమున కాకలి సేసినది ||
ప|| పలికెటి వేదమె ప్రమాణము | తలచిన వారికి తత్త్వము సుండి ||
పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనముల విభుని గలసినది గాన
పలుకుతేనియలను పారమియ్యవే అలరువాసనల నీ అధరబింబాలకు
పలుమరు వుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను