ప|| పాపినైన నాపాల గలిగితోవ | చూపుమన్న నెందు జూపరు ||
ప|| పాయక మతినుండి పరగ మేలుగీడును | సేయించి కర్మి దాజేయుటెవ్వరిది ||
ప|| పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె | కాయమునకు జీవునకును గర్తృత్వము లేదు ||
ప|| పాయపుమదములబంధమా మము | జీయని యిక గృపసేయగదో ||
ప|| పారకుమీ వోమనసా పంతము విడువకుమీ మనసా | పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాడే చెప్పనె మనసా ||
ప|| పారితెంచి యెత్తివేసి పారవెళ్ళితివి | నీరసపు టెద్దవైననీకు నేముద్దా ||
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
ప|| పిలువా గదరే ప్రియునిని | చలువా లాతడు చల్లీ గానీ ||
పిల్ల(గ్రోవి పట్టమంటూ( బెరరేచీనీ మా గొల్లవారి పిల్ల(గ్రోవి కోరో చల్లా
ప|| పుండు జీవులకెల్ల బుట్టక మానదు | పుండుమాన మందువోయగదయ్య ||
పుట్టించేవాడవు నీవే పోరులు వెట్టేవు నీవే యెట్టు నేరుచుకొంటి విది నీవినోదమా
పుట్టినట్టె వున్న వాడ పోలేదు రాలేదు ఇట్టె నీదాసుడనైతి యెంగిలెల్ల బాపె
ప|| పుట్టుగులమ్మీ భువి గొనరో | జట్టికిని హింసలే మీధనము ||
ప|| పుట్టుభోగులము నేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||