పలువిచారములేల పరమాత్మనీవు నాకు కలవు కలవు ఉన్న కడమలేమిటికి
ప|| పసలేని యీబ్రదుకు | ఆసలు చొచ్చిచొచ్చి అలసినట్టాయె ||
ప|| పసిడి చీరవాడావు పాలు దచ్చితివి గాన | పసిడి బోలినది చేపట్టెను నీ కరము ||
పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
పసులు గాచేటి కోల పసువుజేల పొసగ నీ కింత యేల బుద్దుల గోల ||
పాటించి నమ్మిన వారి భాగ్యముగాదా కోటిసుద్దులేల యిదె కోరి చేకొనేది.
పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు యీటు వెట్టి పెద్దతనా లెంచబనిలేదు ||
ప|| పాడరే సోబనాలు పడతులారా | వేడుక లిద్దరిని వెలసెజూడరే ||
పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండువేళల రాగాలను ||
పాప మెఱగను పుణ్యఫల మెఱగను యేపనులు నీకు నెల విన్నియును గావా
పాపపుణ్యముల పక్వ మిదెరుగను నా పాలిటి హరి నమో నమో ||
ప|| పాపపుణ్యముల రూపము దేహమిది దీని | దీపసంబరగింప తెరవెందు లేదు ||
పాపపుణ్యముల రూపము దేహమిది దీని దీపనంబణగింప తెరువెందులేదు
ప|| పాపములే సంబళమెపుడూ యీ- | యాపదబడి నే నలవనా ||
ప|| పాపమెరంగని బ్రాహ్మడు యెందు | జూపరానిచోటు చూపీనయ్యా ||