హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినెరుగనిపుణ్య మంటేరుగాన దురితాలే దురితాలే దురితాలే సుండీ ||
హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని తరగు మొరగులను దాటలే రెవ్వరును
హరియే ఎరుగును అందరి బతుకులు యిరవై ఈతని యెరుగుటే మేలు
హరివారమైతిమి మమ్మవు గాదనగరాదు తరముగా దికను మాతప్పులు లోగొనరో ||
శరనంటి మాతని సంబంధమునజేసి మరిగించి మమునేలి మన్నించవే
హిన దశలు బొంది ఇట్లు నుండుట కంటె నానా విధులను నున్ననాడే మేలు
వెనకేదో ముందరేదో వెఱ్రి నేను నా మనసుమరులు దేర మందేదొకో
శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే
సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింగనొల్లను సర్వజ్ఞుండను నాచార్యుండే సర్వశేషమే నాజీవనము ||
హరి నీవే బుద్ధిచెప్పి యాదరించు నామనసు హరి నీవే నాయంతర్యామివిగాన ||
హరివారమైతిమి మ మ్మవుగాదనగరాదు తరముగా దికను మాతప్పులు లోగొనరో
నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది॥