ప|| సముఖ ఎచ్చరికవో సర్వేశ్వరో | అమరె నీకొలువు ప్రహ్లాద వరద ||
ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||
ప|| సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు | సర్వోత్తముడ నన్నిచట కావవే ||
ప|| సర్వేశ్వరుడే శరణ్యము | నిర్వాహకు డిన్నిటగాన ||
ప|| సర్వోపాయములు జగతి నాకితడే | వుర్వీధరుడు పురుషోత్తముండితడే ||
ప : సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మాసంధ్య
ప|| సహజాచారములెల్ల సర్వేశ్వరునియాజ్ఞే | అహమించి నమ్మకుండు టదియే పాషండము ||
ప|| సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము | నేమమున బెనగొనియె నేడు నీవనక ||
ప|| సారె దూర జాలనూ చలముల కోపమా | చేరితిమా చనవోలి చెన్నుని భ్రమలను ||
ప|| సారె నిన్నలమేల్మంగ జవ్వనమునను | చేరి యవధరింతు విచ్చేవయ్య జాజర ||
సారెకు నానపెట్టకు సంగతిగాదు మారుమాట నేనేర మర్మమింతేగాని ||
ప|| సాసముఖా నడె సాసముఖా | ఆసలసరివారము అవధారు దేవా ||
ప|| సింగారమూరితివి చిత్తజు గురుడవు | సంగతి జూచేరు మిమ్ము సాసముఖా ||
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
ప|| సిరిదొలంకెడి పగలూచీకటా యితడేమి | యిరవుదెలిసియు దెలియనియ్య డటుగాన ||