ప|| సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు | వెరపెరుగడు సూడవే సిన్నెకా ||
ప|| సీతాశోకవిఘాతక వో-| పాతాళలంకాపతివిభాళా ||
ప|| సుఖమును దుఃఖమును జోడుకోడెలు | అఖిలముగన్నవారు అడ్డమాడ రెపుడు ||
సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి | అగ్రేసరుడ నీవు అవధారు దేవ ||
సుముఖ మంగళము జయమంగళము శమదమగత తే జయమంగళం
ప|| సులభమా మనుజులకు హరిభక్తి | వలనొంది మరికదా వైష్ణవుడౌట ||
ప|| సులభమా యిందరికి జూడ సులభముగాక | కలిగె మీకృప నాకు గమలరమణా ||
ప|| సులభుడు మధుసూదనుడు మన- | మెలమి నమ్మిన నిట్టేనుండీ ||
సువ్వి సువ్వి సువ్వాలమ్మా నవ్వుచు దేవకి నందను గనియె॥
ప|| సువ్వి సువ్వి సువ్వి సువ్వని | సుదతులు దంచెద రోలాల ||
సేయనివా డెవ్వడు చిల్లరదోషాలు యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే
ప|| సేయనివా డెవ్వడు చేరి చిల్లరదోషాలు | యేయెడ జీవులజాడు లీశ్వరకల్పితమే ||
ప|| సేవించరో జనులాల చేతులెత్తిమొక్కరో | వావిరి ప్రహ్లదునికి వరదుడు వీడే ||
ప|| సేవింతురే యితని జెలగి పరులిట్లనే | కావించి మమ్ము నెక్కడిదైవ మితడు ||
సేవే భావే శ్రీ బృందం శ్రీ వల్లభ చింతానందం