అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది చెలరేఁగి కందువలు చిత్తగించవయ్యా
అలమేలుమంగను నేనైతేనయితిఁగాక నిలుచుండి నన్నుఁ జూచి నీకేల లోఁగను
అలివేణినిఁ బెండ్లాడవయా చెలులవిన్నపము చేకొనవయ్యా
అల్లదె నీ రమణి ఆయిత్తమై వున్నది పెల్లుగ జాజరాడఁ బిలిచీఁ బోవయ్యా
అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా అల్లుకొంటి విని చెలుల నధోక్షజా
అందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు కందువ మతంగగిరికాడిహనుమంతుఁడు
అందుకే నాపై దయ దలఁచు మాతురబంధుఁడవు యిందరిలో నా దైన్య మేమని చెప్పే నిఁకను
అంగనకు విరహమే సింగారమాయ చెంగట నీవే యిది చిత్తగించవయ్యా
అంజలిరంజలిరయం తే కిం జనయసి మమ ఖేదం వచనైః
అంజనీదేవికొడుకు హనుమంతుఁడు సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు
అంతా నీకు లోనే అనిరుద్ధా మన యంతరంగ మొక్క టాయె ననిరుద్ధా
అంతరంగములో నున్నహరియే గతిగాక చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును
అంతటిదైవమ వటుగాఁగా చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము
అనంత మద్భుత మాశ్చర్యం బిది సనాతనుఁడ నను సరవిఁ గావవే
అన్నిసింగారాలు నీకె అమరుఁగాక యన్నిటా దేవతలు నిన్నందుకే మెచ్చేరు