ప|| వెనక ముందరికి బెద్దల కెల్లను వివరపు సమ్మతి యీ వెరవు | వెనుకొని తన గురు నాథుని యనుమతి వేదోక్తంబగునీ తెరవు ||
వెన్నలుదొంగిలునాటివెఱ్రివా నీవు విన్నకన్న జాడ గాదు వెఱ్రివా నీవు
ప|| వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు- | నెన్నివలసినను దమయేలేటివి కావా ||
ప|| వెరపులు నొరపులు వృథా వృథా | ధరపై మరి యంతయును వృథా ||
ప|| వెరవకు మనసా విష్ణుని అభయము | నెరవుగ యెదుటనే నిలిచి యున్నది ||
వెర్రివాడ వెర్రివాడ వినియు గనియు మర వెర్రి దెలిసి రోకలి వేరె చుట్టేగాక
ప|| వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము లేక | విర్రవీగేయహంకారి వెర్రివాడు ||
ప|| వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి- | కుఱచబుద్ధుల నెట్టు గూడుదునయ్య ||
ప|| వెఱవకు మనసా విష్ణుని యభయము | నెఱవుగ నెదుటనే నిలచినది ||
వెఱ్రి మానుప రెవ్వరు వేదురు నాయంత విడువదు ముఱ్రబాలలోబుట్టిన ముంచిన వెఱ్రెయ్యా.
వెఱ్రిదెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు యిఱ్రిదీముభోగముల నెనసేము
వెఱ్రివారి దెలుపుటవేవేలు సుకృతము ముఱ్రుబాలమంకే కాని ముందు గాన దైవమా
వెలయు నీ కల్యాణవేదిగా మతినుండి కలికి జవ్వనపు యాగము సేసెనతడు ||
ప|| వెలయునిన్నియును వృథావృథా | తలపున శ్రీహరి దడసినను ||
ప|| వెలికీ వెళ్ళడు చలికీ వెరవడు | వులికీ నులికీ నులికీనయ్యా ||