వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు భవసంపదలపెద్దపౌజు చూచీ జీవుడు
విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ శాశ్వతునకూహింప జన్మమికనేడ
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము
విష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా
విష్ణుడే ఇంతానని భావించుటే బుద్ది వైష్ణవుడై ఆచార్య సేవ చేయుటే బుద్ది
ప|| వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
ప|| వీడె వీడె కూచున్నాడు వేడుకతో గద్దెమీద | వాడి ప్రతాపముతోడి వరదాన సింహము ||
వీణ వాయించనే అలమేలుమంగమ్మ వేణుగాన విలోలుడైన వేంకటేశునోద్ద ||
వీధుల వీధుల విభుడేగేనిదె మోదము తోడుత మొక్కరో జనులు
ప|| వీని జూచియైన నేము విరతిబొందగలేము | పూని మాబ్రదు కిందుబోలదాయగా ||
ప|| వీనిజూచియైన నేము విరతిబొందగలేము | పూని మాబ్రదు కిందుబోలదాయగా ||
వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి ||
ప|| వెట్టిమోపువంటిమేను విడనాడి వీ- | డిట్టె దాటిపోయె నెటువంటిజాణే ||
ప|| వెడమంత్ర మికనేల వేరువెల్లంకులు నేల | పుడమిధరుడు మాకు భువనౌషధము ||
ప|| వెదకిన నిదియే వేదార్థము | మొదలు తుదలు హరి మూలము ||