ప|| వైష్ణవులుగానివార లెవ్వరు లేరు | విష్ణుప్రభావ మీవిశ్వమంతయు గాన ||
ప|| శతాపరాధములు సహస్రదండన లేదు | గతి నీవని వుండగ కావకుండగారాదు ||
ప|| శమముచాలనియట్టిజన్మం బిదేమిటికి | దమముచాలనియట్టితగు లిదేమిటికి ||
శరణంటి మాతనిసమ్మంధమున మరిగించి మమునేలి మన్నించవే ॥పల్లవి॥
ప|| శరణంబితడే సకలము నాకును | వెరవున మనసా వెతకవో ఇతని ||
ప|| శరణాగత వజ్ర పంజరుడితడు | చక్రధరుడు అసుర సంహారుడు || అప|| వెరవుతోడ తను శరణనువారికి | వెనుబలమీతడే రక్షకుడు ||
శరణు కపీశ్వర శరణం బనిలజ సరవి నెంచ నీసరి యిక వేరీ
శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా
శరణు శరణు విభీషణ వరదా శరధిబంధన రామ సర్వగుణస్తోమ
శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు అరుదైన రామ కార్యదురంధరా
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా
ప|| శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ | అరసి రక్షించుము అయోధ్యారామ ||
ప|| శోభనమే శోభనమే వై- | భవముల పావన మూర్తికి ||
ప|| శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచిన యిన్నటికి దగును ||
ప|| శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||