వేంకటాద్రి విభునిబాసి విరహియైన రమణిజూచి రంకెలు వేయనేటికమ్మ రాజసమునను ||
ప|| వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||
ప|| వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ ||
ప|| వేదన బొరలే వెరవేలా | యీదయ విధి దనకీయదా ||
వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ ||
వేదవేద్యులు వెదకేటిమందు ఆదినంత్యము లేని ఆ మందు
వేఱొకచోట లేడు వీడివో హరి వీఱిడియై చేరువనే వీడివో హరి.
ప|| వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని | గోలతనమిపుడేలే కొంగుపట్టీ నతడు ||
ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | భావించ నలవిగాని పరమాత్ముడితడు ||
వేవేలు బంధములు విడువ ముడువబట్టె దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా
వేసరకు వీ డేల యనకుము విడువ నిన్నిక శరణు చొచ్చితి నీసరెవ్వరు లేరు వెదకిన నిండుబండికి జేట వేగా
ప|| వేసరించేదానగాను వేగినంతా నిన్నును | రాశికెక్క మీకృపనే రతి జెలగుదును ||
ప|| వేసరితిమెట్ల నీవెంట దిరిగి | గాసిబెట్టక మమ్ము గావరారా ||
ప|| వైష్ణవులుగానివార లెవ్వరు లేరు | విష్ణుప్రభావ మీవిశ్వమంతయు గాన ||
ప|| శతాపరాధములు సహస్రదండన లేదు | గతి నీవని వుండగ కావకుండగారాదు ||